కర్నూలులో అగస్త్య ఎనర్జీ భారీ ప్రాజెక్టు.. రూ. 7,800 కోట్ల పెట్టుబడితో 12 GW ఇంగాట్ & వేఫర్ ప్లాంట్!
అనుభవ్ అగర్వాల్ గ్రూప్‌లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ. 7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ , వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయంగా సౌర ఉత్పాదక సామర్థ్యాలు మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రత్యక్షంగా , పరోక్షంగా 3,500కు పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు:
కర్నూలు ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్లో రూ. 7,800 కోట్ల భారీ పెట్టుబడితో ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.
12 GW సమీకృత ఇంగాట్ , వేఫర్ ఉత్పాదనల ద్వారా కంపెనీ ప్రస్తుత సోలార్ సెల్ , మాడ్యూల్ తయారీ సామర్థ్యాలు మరింత బలపడతాయి.
దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని గ్లోబల్ సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
అనుభవ్ అగర్వాల్ గ్రూప్ , నేతల స్పందన:
అనుభవ్ అగర్వాల్ (చైర్మన్): భారతదేశ ఇంధన పరివర్తనపై తమకు ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోందని, దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థ అవసరమని తెలిపారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఏపీలో పారిశ్రామిక వృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టి.జి. భరత్‌లకు అగస్త్య ఎనర్జీ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
పియూష్ బిచోరియా , బెర్నార్డ్ రాక్ (డైరెక్టర్ & CEO): ఇంగాట్, వేఫర్, సెల్ , మాడ్యూల్ తయారీని ఒకే వేదికపైకి తెచ్చే ఈ సమీకృత ప్రాజెక్టు భారతదేశ ‘మేక్ ఇన్ ఇండియా’ , ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.








