50 ఏళ్ల రాజకీయ జీవితంలో.. గ్రూప్- 1 లాంటి స్కామ్ చూడలేదు : సీఎం చంద్రబాబు
తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 (Group-1) లాంటి స్కామ్‌ను ఎన్నడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అసెంబ్లీ లాబీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎల్లుండి అన్ని వాస్తవాలను అసెంబ్లీ (Assembly)లో పెడతామని తెలిపారు. గొడ్డలి పార్టీ స్వార్థానికి ఎందరో నిరుద్యోగులు బలయ్యారు. డీఎస్సీ అభ్యర్థులు (DSC candidates) ఆత్మాభిమానంతోనే రోడ్డెక్కారు. డీఎస్సీ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. డీఎస్సీతో వారికి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే వారు ఎలా సహించగలరు అని ప్రశ్నించారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి విమాన కార్యకలాపాలు ప్రారంం కావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport)లో ల్యాండ్ కావడం ద్వారా రాష్ట్రంలో కొత్త కనెక్టివిటీ శకం ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు. భోగాపురం నుంచి విమానాలు ఎరగడంతో యువత ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్‌కు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని అన్నారు.








