ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ .. ఈవీకి మారితే
హైదరాబాద్ మహానగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. స్వచ్ఛ హైదరాబాద్ (Hyderabad) దిశగా అడుగులు వేసేందుకు నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణాశాఖ (Transport Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఆటో రిక్షా (Auto Rickshaw) ఎలక్ట్రిక్ మార్పిడి పథకం -2026తో నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ (ORR) లోపల తిరిగే ఆటోల నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.








