కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
కల్యాణలక్ష్మి (Kalyanalakshmi), షాదీముబారక్ (Shadi Mubarak)ను యథాతథంగా కొనసాగిస్తామని హైకోర్టు (High Court)లో స్టే ఎత్తివేయించి మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. చిన్న స్టేను సాకుగా చూసి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు నిలిచిపోవని మంత్రి వాకిటీ శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఇప్పటివరకు ఇచ్చినట్లే ఇకపై కూడా 3 నెలల్లోనే కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ తెచ్చిన కొన్ని పథకాలపై తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని వెల్లడించారు.








