తెలుగు సినిమాలపై మరోసారి బాలీవుడ్ డైరెక్టర్ నెగెటివ్ కామెంట్!
బాహుబలి(bahubali) తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల మార్కెట్, ప్రభావం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువగా అంచనా వేసిన బాలీవుడ్ వర్గాలు సైతం ఆ తర్వాత తెలుగు సినిమాల సక్సెస్‌లను సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ మార్పుపై కొందరు బాలీవుడ్ ప్రముఖులు తరచూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్(Siddharth Anandh) చేసిన ఓ చిన్న కామెంట్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
హైదరాబాద్‌లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Animal Pre Release Event)లో మల్లారెడ్డి(Malla Reddy) చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఫ్యూచర్ లో ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతుందని, తెలుగు సినిమాల ఆధిపత్యం పెరుగుతుందని ఆయన కామెంట్స్ ను ఆ వీడియోలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఓ నార్త్ ఇండియన్ నెటిజన్.. గేమ్ ఛేంజర్(Game changer), ది రాజాసాబ్(The Raja Saab), ఓజీ(OG), దేవర(Devara) లాంటి భారీ తెలుగు సినిమాల రిజల్ట్స్ ను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చాడు.
ఈ పోస్టుకు సిద్దార్థ్ ఆనంద్ ఊప్స్ అంటూ రియాక్ట్ అవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలోనూ తెలుగు సినిమాలపై ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన నేపథ్యంలో.. తాజా రిప్లై కూడా అదే యాంగిల్ లో ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సిద్దార్థ్ ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా చెప్పకపోయినా, ఆయన ఒక్క పదం కామెంట్ మాత్రం టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ డిస్కషన్‌కు మరోసారి ఆజ్యం పోసింది.








