ఇద్దరు సూపర్స్టార్లు.. పూర్ణకు మాత్రం ఇదే స్పెషల్ ప్లస్!
ఒకప్పుడు హీరోయిన్గా, నటిగా విభిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ(Poorna) అలియాస్ షమ్నా కాసిమ్(Shamna Kasim).. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కనిపించే విధానం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నా మధ్య మహేష్ బాబు(mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి(Kurchi Madatha petti) సాంగ్ లో పూర్ణ సందడి చేసిన సంగతి తెలిసిందే. సాంగ్ లో ఆమె కనిపించిన టైమ్ తక్కువే అయినా.. ఎనర్జిటిక్ స్టెప్పులతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు పూర్ణకు మరో బిగ్ ఛాన్స్ దక్కింది. సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ సినిమా జైలర్2(Jailer2)లో ఆమె స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ఫస్ట్ సింగిల్ ప్రోమోలోనే పూర్ణ డ్యాన్స్ మూమెంట్స్ కనిపించడంతో సాంగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఆగస్టు 21న ఫుల్ సాంగ్ రిలీజ్ కానుండటంతో సినిమాలో ఆమెకు ఎంత ప్రాధాన్యత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఇలా టాలీవుడ్లో మహేష్ బాబు, కోలీవుడ్‌లో రజనీకాంత్ వంటి ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. స్క్రీన్ టైమ్ లిమిటెడ్ గా ఉన్నప్పటికీ తన ఎనర్జీ, డ్యాన్స్‌తో సాంగ్స్ కు ఎక్స్ట్రా హైప్ తీసుకురావడం ఆమెకు ప్లస్‌గా మారుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా వరుస అవకాశాలు అందుకోవడం పూర్ణ కెరీర్‌కు కొత్త ఊపునిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








