రణ్‌బీర్‌తో మళ్లీ అలియా.. తోడుగా దీపికా.. బ్రహ్మాస్త్ర 2పై భారీ అప్డేట్!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) కెరీర్లో బ్రహ్మాస్త్ర2(brahmastra2) మరోసారి కీలక ప్రాజెక్ట్‌గా మారుతోంది. అయాన్ ముఖర్జీ(Ayaan Mukherji) దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భాగం తర్వాత సీక్వెల్‌పై చాలాకాలంగా డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు మళ్లీ వేగం పుంజుకున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ టీమ్ బ్రహ్మాస్త్ర2 స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రామాయణ(Ramayana) రెండో భాగం షూటింగ్‌ను 2027 జనవరి నాటికి పూర్తి చేయనున్న రణ్‌బీర్.. కొంత గ్యాప్ తర్వాత ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సీక్వెల్లో మరో ఆసక్తికరమైన అంశం దీపికా పదుకొణె(Deepika Padukone)తో సంబంధించినదిగా చెబుతున్నారు. అమృత(Amrutha) పాత్ర కోసం ఆమెతో చిత్రబృందం డిస్కషన్స్ జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు రణ్‌బీర్ శివ(Shiva)తో పాటు దేవ్(Dev) అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, అలియా భట్(Alia Bhatt) ఈషా(eesha)గా తిరిగి కనిపించనుందని టాక్. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
వార్2(war2) తర్వాత అయాన్ ముఖర్జీ కెరీర్‌పై వచ్చిన డిస్కషన్స్ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర2 లేటవుతుందనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియన్ మైథాలజీని మరింత విస్తృతంగా చూపిస్తూ ఆస్ట్రావర్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రణ్‌బీర్ చేతిలో సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali)లవ్ అండ్ వార్(Love and war), సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) యానిమల్ పార్క్(Animal Park2) వంటి భారీ సినిమాలున్నాయి. వీటి షూటింగ్స్, రిలీజ్ డేట్స్ ను బట్టి బ్రహ్మాస్త్ర 2 షెడ్యూల్ ఎలా సెట్ అవుతుందో చూడాలి.








