అనుపమకు అదితి శంకర్ సపోర్ట్!
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన గత రిలేషన్‌కు సంబంధించిన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో డిస్కషన్‌కు దారితీసింది. తన లైఫ్ లో ఎదురైన పరిస్థితులు, ఆ రిలేషన్షిప్ తనపై చూపిన ఇంపాక్ట్ గురించి ఆమె మాట్లాడటంతో ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హీరోయిన్ అదితి శంకర్(Aditi Shankar) కూడా అనుపమ ఇంటర్వ్యూపై రియాక్ట్ అయ్యారు. తాను ఆ ఇంటర్వ్యూను ఇటీవలే చూశానని, అందులో అనుపమ తనకు ఎదురైన ఎక్స్‌పీరియెన్స్‌ను తన యాంగిల్ లో వివరించినట్టుగా అనిపించిందని అదితి తెలిపారు.
అనుపమ మాట్లాడిన విధానంలో ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచే ప్రయత్నం తనకు కనిపించలేదని అదితి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా చూడాల్సిన అవసరం లేదని, ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే తన ఎక్స్‌పీరియెన్స్ ను దాచకుండా బయటకు వచ్చి మాట్లాడినందుకు అనుపమను ఆమె అభినందించారు. ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటం వల్ల పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు మాత్రమే కాకుండా, సమాజంలో చర్చించాల్సిన కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని అదితి అన్నారు.
ముఖ్యంగా ఈ తరహా పరిస్థితులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కావని అదితి గుర్తుచేశారు. కొన్ని సంబంధాల్లో పురుషులు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని, అయితే అది జరుగుతున్న టైమ్‌లో తమకు ఏం జరుగుతుందో వారు గుర్తించకపోవచ్చని చెప్పారు. అందుకే అనుపమ చెప్పిన విషయాన్ని బ్రేకప్ డిస్కషన్‌గా కాకుండా, అవగాహన కల్పించే కోణంలో చూడాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.








