మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ముగ్గురి అరెస్టు
స్థిరాస్తి వ్యాపారిపై దాడి, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాజీ ఓఎస్డీ సుమంత్ ( Sumanth) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరుణ్‌కుమార్ (Arun Kumar), మహేందర్ రెడ్డి (Mahender Reddy), కార్దిక్ కుమార్ లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force police) అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం నగర పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది.








