అమరావతి ఛాంపియన్షిప్లో హోంమంత్రి అనితకు గాయం
తిరుపతిలో డ్రోన్ (Drone) ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాష్ట్ర హోం మంత్రి అనిత (Home Minister Anita)కు స్వల్ప గాయమైంది. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ (Amaravati Championship) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోం మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓ డ్రోన్ ను ఎగరవేయగా, బ్యాటరీ ఛార్జింగ్ (Battery Charging) తగ్గి కిందకి పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న హోం మంత్రి అనిత చేయికి డోన్ తగిలి స్వల్ప గాయమైంది.








