28th  August 2026

_________

- Bhuvana

సింపుల్‌గా, స్టైలిష్‌గా.. చిన్న గోళ్ల కోసం ఈ French Nail Designs చూడండి!

న్యూడ్ లేదా షీర్ బేస్‌పై చాలా పలుచని వైట్ టిప్ వేయండి. సింపుల్‌గా ఉండి రోజువారీ లుక్‌కు కూడా చక్కగా సరిపోతుంది. 

క్లాసిక్ వైట్ మైక్రో ఫ్రెంచ్

సాఫ్ట్ పింక్ బేస్‌తో కొంచెం డార్క్ పింక్ టిప్స్ జోడిస్తే ఫెమినైన్, ఫ్రెష్ లుక్ వస్తుంది. షార్ట్ స్క్వేర్ నెయిల్స్‌కు బాగుంటుంది.

పింక్ ఫ్రెంచ్ టిప్స్

మినిమల్ లుక్‌కి మెటాలిక్ టచ్ కావాలంటే సిల్వర్ క్రోమ్ టిప్స్ ట్రై చేయండి. చిన్న గోళ్లపైనా ఇవి ప్రత్యేకంగా మెరుస్తాయి. 

సిల్వర్ క్రోమ్ ఫ్రెంచ్

బోల్డ్ కలర్ నచ్చితే వైట్‌కు బదులుగా రెడ్ మైక్రో టిప్స్ ఎంచుకోండి. చిన్న గోళ్లపై కూడా స్టైలిష్‌గా కనిపించే సింపుల్ డిజైన్ ఇది. 

రెడ్ మైక్రో ఫ్రెంచ్

లావెండర్, బేబీ బ్లూ, పీచ్ లేదా మింట్ వంటి పాస్టెల్ షేడ్స్‌తో ఫ్రెంచ్ టిప్ వేస్తే సాఫ్ట్, ట్రెండీ లుక్ పొందవచ్చు.

పాస్టెల్ ఫ్రెంచ్ నెయిల్స్

న్యూడ్ బేస్‌పై పలుచని బ్లాక్ లైన్ వేయడం ద్వారా క్లాసిక్ ఫ్రెంచ్‌కు మోడ్రన్ ట్విస్ట్ ఇవ్వొచ్చు. మినిమల్, ఎడ్జీ లుక్‌కు ఇది బెస్ట్.

బ్లాక్ మైక్రో ఫ్రెంచ్

స్పష్టమైన టిప్‌కు బదులుగా న్యూడ్ నుంచి వైట్ వరకు సాఫ్ట్ గ్రేడియంట్ ఉండే ఓంబ్రే ఫ్రెంచ్ ఎంచుకుంటే నెయిల్స్ సొగసుగా కనిపిస్తాయి.

ఓంబ్రే ఫ్రెంచ్

సాధారణ టిప్‌కు బదులుగా లైట్ రిఫ్లెక్ట్ అయ్యే క్యాట్-ఐ ఎఫెక్ట్‌ను టిప్‌పై మాత్రమే వాడండి. చిన్న గోళ్లకు ఇది ట్రెండీ ట్విస్ట్. 

క్యాట్-ఐ ఫ్రెంచ్