28th  August 2026

_________

- Bhuvana

ఇంటికి ప్రశాంతమైన లుక్ కావాలా? ఈ Indoor Water Fountain ఐడియాలు చూడండి!

చిన్న ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌కు టేబ్‌టాప్ ఫౌంటెన్ చక్కని ఎంపిక. కన్సోల్, సైడ్ టేబుల్ లేదా డెస్క్‌పై సులభంగా పెట్టుకోవచ్చు.

టేబ్‌టాప్ ఫౌంటెన్

ఫ్లోర్ స్పేస్ తక్కువగా ఉంటే వాల్ మౌంటెడ్ వాటర్ ఫీచర్ ఎంచుకోండి. ఇది ఖాళీ గోడను ఆర్ట్ పీస్‌లా మార్చగలదు.

వాల్ మౌంటెడ్ ఫౌంటెన్

లివింగ్ రూమ్‌లో కాంపాక్ట్ ఫ్లోర్ ఫౌంటెన్‌ను మూలలో లేదా సీటింగ్ ఏరియా దగ్గర ఉంచితే డెకర్‌కు ప్రత్యేకమైన ఫోకస్ వస్తుంది.

లివింగ్ రూమ్‌కు స్టేట్‌మెంట్ పీస్

స్లేట్, మార్బుల్, గ్రానైట్ వంటి నేచురల్ స్టోన్ మెటీరియల్స్ ఫౌంటెన్‌కు రిచ్, ఎర్తీ లుక్ ఇస్తాయి. మోడ్రన్ ఇంటీరియర్‌తోనూ ఇవి బాగుంటాయి.

నేచురల్ స్టోన్ డిజైన్

ఫౌంటెన్ చుట్టూ చిన్న ఇండోర్ ప్లాంట్స్ లేదా గ్రీన్ వాల్ జోడిస్తే నీరు, ప్రకృతి కలిసిన బయోఫిలిక్ లుక్ వస్తుంది.

గ్రీనరీతో కలిపి అలంకరించండి

ఫౌంటెన్ వెనుక లేదా చుట్టూ సాఫ్ట్ LED లైటింగ్ ఇస్తే నీటి కదలిక మరింత అందంగా కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి హాయైన అంబియన్స్ వస్తుంది.

వార్మ్ లైటింగ్‌తో మరింత అందం

చిన్న గదిలో భారీ ఫౌంటెన్ పెట్టకండి. గది పరిమాణం, ఫర్నిచర్, నడిచే స్థలాన్ని బట్టి ఫౌంటెన్ పరిమాణాన్ని ఎంచుకోవడం ముఖ్యం. 

సరైన సైజ్ ఎంచుకోండి

నీటిని శుభ్రంగా ఉంచడం, పంప్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, లీకేజీలు లేకుండా చూడటం ముఖ్యం. ఎలక్ట్రానిక్స్‌కు దూరంగా ఉంచండి.