నేపాల్ జలప్రళయంలో అమెరికన్ల గల్లంతు
నేపాల్లోని మూడు జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఇటీవలి కాలంలో ఆ హిమాలయ దేశం ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన విపత్తులలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో 165 మంది మరణించగా, 300 మందికి పైగా భారతీయ పర్యాటకులతోపాటు అమెరికాకు చెందిన కొందరు కూడా గల్లంతయ్యారు. ఇప్పటికే వీరి ఆచూకి కోసం నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.








