పండగ కళ మొత్తాన్ని తనలోనే నింపుకున్న మానస
ఫెమినా మిస్ ఇండియాగా గెలిచి, టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన మానస వారణాసి(manasa varanasi) ప్రస్తుతం కెరీర్లో పలు సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఓనం పండుగ సందర్భంగా చీరలో మెరిసింది మానస. ఇందులో క్లాసిక్ హాఫ్ వైట్ కేరళ కసవు శారీ, గోల్డెన్ జరీ బోర్డర్, చిన్న చిన్న చుక్కల డిజైన్ తో ఎంతో క్లాసీగా ఉంది. ఈ శారీకి ఆమె మెడలో హారం, దానికి మ్యాచింగ్ చెవి దిద్దులు, ఎర్రటి బొట్టు, తలలో పూలు పెట్టుకుని పండగ కళ మొత్తాన్ని తనలోనే నింపుకుంది. మానస షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.








