ఛీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ అరెస్టు
టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని(pavan sadhineni) అరెస్ట్ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పవన్‌ను న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సమాచారం.
ప్రేమ ఇష్క్ కాదల్(Prem ishq kadal), సావిత్రి(Savitri), సేనాపతి(Senapathi) వంటి సినిమాలతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాదినేని.. వెబ్ కంటెంట్‌లోనూ తనదైన ముద్ర వేశారు. పిల్ల(Pilla), ఈ ఆఫీస్‌లో(ee office lo), కమిట్‌మెంటల్(commitmental), దయా(Daya) వంటి ప్రాజెక్టులకు దర్శకత్వం వహించారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన 2013లో తెలుగు సినిమాతో డైరెక్టర్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
ప్రస్తుతం పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka taara)పై కూడా ఈ పరిణామం ప్రభావం చూపుతుందా అనే డిస్కషన్ మొదలైంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(pooja hegde), శృతి హాసన్(Shruti Haasan) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్లో గణనీయమైన భాగం పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
లైట్‌బాక్స్ మీడియా(Lightbox media), స్వప్న సినిమా(Swapna cinema), గీతా ఆర్ట్స్(geetha arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తాజా కేసు నేపథ్యంలో సినిమా తదుపరి షెడ్యూల్స్, ప్రమోషన్స్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, కంప్లైంట్ లోని ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు పరిధిలోనే ఉన్నాయి. కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల విచారణ, న్యాయ ప్రక్రియ పూర్తైన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.








