నేపాల్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ విలయం.. 400 మంది పర్యాటకులు మృతి
నేపాల్ లో జలవిలయం మృత్యుహేళను తలపించింది. ఊహించని విదంగా ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ .. నేపాల్ ను అతలాకులతం చేశాయి. మెరుపు వరదలకు…400 మందికి పైగా పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డ్ వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా.. అందులో 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. ప్రభావిత ప్రాంతంలోని ట్రావెల్ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కల ఆధారంగా ప్రాథమికంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
భోటెకోశీ నది బుధవారం ఉదయం ఉద్ధృతంగా ప్రవహించింది (flash floods). నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇళ్లు, ప్రాజెక్టు కేంద్రాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. నేపాల్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపడుతోంది. అయితే పర్వత ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి.
నేపాల్‌కు సరిహద్దులో ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు కేంద్రం అడ్వైజరీలు జారీ చేసింది. గండక్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించింది.
ప్రకృతి విపత్తు ప్రభావం చైనా (China)ను తాకింది. టిబెట్‌లోని చైనా-నేపాల్ సరిహద్దులో కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం సంభవించింది. నివాస ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పూర్తిస్థాయి సహాయక చర్యలకు ఆదేశించారు. మరోవైపు, మెరుపు వరదలకు సంబంధించి ముందస్తు వార్నింగ్ ఇవ్వడంలో చైనా విఫలమైందనే ఆరోపణలు నేపాల్‌లో వినిపిస్తున్నాయి.








