విశ్వంభర రిలీజ్‌పై సస్పెన్స్.. నాలుగు రోజుల్లో మెగాస్టార్ పని పూర్తి!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న విశ్వంభర(vishwambhara) సినిమా రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. దసరా రిలీజ్ టార్గెట్ గా చిత్రబృందం ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంశం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, చాలా కాలం తర్వాత చిరంజీవి తాజాగా విశ్వంభర షూటింగ్లో పాల్గొన్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు రీషూట్ అవసరమవడంతో ఆయన స్పెషల్ గా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు రోజుల పాటు షూటింగ్లో పాల్గొని పెండింగ్‌లో ఉన్న రీషూట్ పార్ట్‌ను పూర్తి చేయాలని మెగాస్టార్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో షూటింగ్ పరంగా సినిమా కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్స్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా టీమ్ పనిచేస్తోంది. సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పెట్టుబడిలో గణనీయమైన మొత్తాన్ని రికవర్ చేయడం నిర్మాతలకు కీలకంగా మారింది.
వశిష్ఠ(Vassishta) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ అందిస్తుండగా, హరి గౌర(Hari Gowra) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్, వీఎఫ్ఎక్స్, బిజినెస్ వ్యవహారాలు ఒకేసారి ముందుకు సాగుతున్న నేపథ్యంలో విశ్వంభర రిలీజ్‌పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.








