నేపాల్ జల విలయానికి కారణం ఇదే..
ఒకే ఒక్క నిమిషం… అంతా జల ప్రళయమే. కళ్లు మూసి తెరిచే లూపే కొండ చరియలు ఫెళ ఫెళ విరిగిపడ్డాయి. నదులు కూడా ఉగ్రరూపమెత్తాయి. కనీవినీ ఎరుగని జలప్రళయమిది. అకస్మాత్తుగా జలప్రళయం రావడంతో చైనాలోని టిబెట్, ఇటు నేపాల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలను కూడా తుడిచేసింది. ఈ దారుణ ప్రకృతి విలయానికి సుమారు 157 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గల్లంతైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అలాగే కైలాస మానవ సరోవర యాత్ర కోసం వెళ్కలిన సుమారు వందలాది మంది భక్తుల ఆచూకీ కూడా దొరకడం లేదు.
మంచు కొండల వల్లే ఇంతటి విలయమా?
ఈ జల విలయానికి హిమానీ నది విరిగి నదిలో కలవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఒక్కటే కారణమా? మరేమైనా కారణాలు వున్నాయా? అని కూడా ఆలోచిస్తున్నారు. భోటెకాశీ నది విశ్వరూపానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, స్థానికులు తీసిన వీడియోలను కూడా అధ్యయనం చేస్తున్నారు. భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా నదిలో కలవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో వున్న భోటెకాశీ నదికి త్రిశూల్, లెండే భోలా లాంటి ఉప నదులున్నాయి. అయితే.. బుధవారం ఉదయం ఈ ప్రాంతంలో రెక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో గల్ఫీ ప్రాంతానికి ఎగువన 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో వున్న ఒక హిమానీ నదిలో దాదాపు 2,000 అడుగుల వెడల్పైన మంచు ప్లేట్ ఒకటి వేరుపడి, నదిలో పడిందని అంటున్నారు.
అలాగే ఈ విలయానికి కొండచరియలు విరిగిపడటం కూడా కారణమని అంటున్నారు. ఈ జల విలయం కారణంగా భోటెాకశీ నది వ్యవస్థపై వున్న 12 జల విద్యుత్ కేంద్రాలతో పాటు అనేక వంతెనలు నామరూపాలు లేకుండానే పోయాయి. ఈ ప్రవాహం భోటెకాశీ నదిలో నుంచి త్రిశూల్ నదిలోకి కూడా వెళ్లడంతో ప్రవాహం అమాంతం పెరిగిపోయింది. దీంతో గ్రామాలు, పట్టణాలు పూర్తిగా అందులోనే కలిసిపోయాయి.








