దేశంలో 8.7 కోట్ల మంది యువత ఖాళీగానే: నీతి ఆయోగ్ సంచలన నివేదిక!
భారతదేశం ‘వికసిత్ భారత్ @2047’ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత భవిష్యత్తుపై నీతి ఆయోగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ @2047’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో విస్తుపోయే నిజాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 15 నుండి 29 ఏళ్ల వయస్సు ఉన్న దాదాపు 8.7 కోట్ల మంది యువత ఎలాంటి చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా (NEET – Not in Education, Employment, or Training) పూర్తిగా ఖాళీగా (Unemployment) ఉన్నారని స్పష్టం చేసింది.
ఆర్థిక ఇబ్బందులతో స్కిల్స్‌కు దూరం
చాలామంది తక్కువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ కాలేజీ ఫీజులు, ప్రైవేటు ట్యూషన్లకే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోడింగ్, టెక్నికల్ కోర్సులు వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకునేందుకు వారు డబ్బులు చెల్లించలేకపోతున్నారు. ఫలితంగా, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరడం లేదా అసలు ఎలాంటి పనీ దొరక్క ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. దేశంలో నైపుణ్యం కలిగిన పట్టభద్రుల్లో (Unemployment) కేవలం 8.25 శాతం మంది మాత్రమే తమ చదువుకు, సామర్థ్యాలకు సరిపోయే సరైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారని నివేదిక తెలిపింది.
నీతి ఆయోగ్ పరిష్కారాలు..
ఈ నైపుణ్య సంక్షోభాన్ని (Unemployment) అధిగమించడానికి నీతి ఆయోగ్ ప్రభుత్వానికి పలు కీలక సిఫార్సులు చేసింది:
ఉచిత/రాయితీ శిక్షణ: ఖాళీగా ఉంటున్న (NEET) యువతకు, మహిళలకు అందుబాటు ధరల్లో లేదా రాయితీతో కూడిన ఉచిత స్కిల్ ట్రెయినింగ్ (నైపుణ్య శిక్షణ) అందించాలి.
చదువుతూనే సంపాదన: విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకునే (Earn while you learn) వెసులుబాటు కల్పించాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సాయం అందించాలి.
ఇండస్ట్రీ రెడీ కోర్సులు: స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలకు సరిపోయేలా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ ప్రాజెక్టులతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టాలి.
స్వయం ఉపాధికి పెద్దపీట: కేవలం ఇతరుల వద్ద ఉద్యోగాలు చేసేలా శిక్షణ ఇవ్వడం కాకుండా, స్థానిక డిమాండ్‌ను బట్టి స్వయం ఉపాధి (Unemployment) పొందేలా నైపుణ్యాలు పెంచాలి. వేగంగా ఎదుగుతున్న కొత్త రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.








