25th  August 2026

_________

- Bhuvana

ఆడపిల్లను ధైర్యంగా పెంచాలంటే.. చిన్నప్పటి నుంచే నేర్పాల్సిన  విషయాలు

తనకు నచ్చని లేదా అసౌకర్యంగా అనిపించే విషయాలకు ‘నో’ చెప్పడం తప్పు కాదని చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా చెప్పండి. 

‘నో’ చెప్పడం నేర్పండి

చిన్న నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాన్ని అడగండి. ప్రశ్నలు అడగడం, గౌరవంగా తన మాట చెప్పడం ధైర్యాన్ని పెంచుతుంది.

తన మాట తానే చెప్పేలా చేయండి

సేఫ్, అన్‌సేఫ్ టచ్, వ్యక్తిగత హద్దులు, ఇబ్బంది కలిగితే నమ్మకమైన పెద్దలకు చెప్పడం వంటి విషయాలను వయసుకు తగ్గట్టు నేర్పండి.

సేఫ్టీ బౌండరీస్ నేర్పండి

వయసుకు తగిన పనులు స్వయంగా ప్రయత్నించే అవకాశం ఇవ్వండి. ఫలితం కంటే ప్రయత్నాన్ని ప్రశంసించడం ఆత్మవిశ్వాసానికి తోడ్పడుతుంది.

తప్పులు చేయనివ్వండి

చదువు, ఆటలు, ఇంటి పనులు, నాయకత్వం వంటి అవకాశాల్లో లింగభేదం చూపకుండా తన ఆసక్తులను అన్వేషించే స్వేచ్ఛ ఇవ్వండి. 

అబ్బాయిలతో సమాన అవకాశాలు

భయం, కోపం, బాధ, ఆనందం వంటి భావాలను స్వేచ్ఛగా చెప్పే వాతావరణం కల్పించండి. వినే తల్లిదండ్రులు పిల్లల్లో నమ్మకాన్ని పెంచుతారు.

భావాలను దాచొద్దని చెప్పండి

ఎవరితో చాట్ చేయాలి, ఏ సమాచారాన్ని పంచుకోకూడదు, అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే ఎవరికి చెప్పాలి వంటి విషయాలు నేర్పండి.

సేఫ్టీ కోసం డిజిటల్ జ్ఞానం

సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దలను ఆశ్రయించడం బలహీనత కాదని చెప్పండి. ఇంట్లో నమ్మకమైన వాతావరణం కల్పించండి.

ధైర్యంతో పాటు సహాయం అడగడం