బ్రహ్మాస్త్ర2 కు కొత్త భాగస్వామి!
బాలీవుడ్లో భారీ అంచనాలున్న బ్రహ్మాస్త్ర2(brahmastra2) ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. సీక్వెల్ నిర్మాణంలో భాగస్వామి కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్న డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(ayaan mukharjee).. నిర్మాత నమిత్ మల్హోత్రా(namith Malhotr)కు చెందిన ప్రైమ్ ఫోకస్ తో డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డిస్కషన్స్ కీలక దశలో ఉన్నప్పటికీ, ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని సమాచారం.
మొదటి బ్రహ్మాస్త్రలో ప్రైమ్ ఫోకస్ భాగస్వామ్యం కావడం ఈ డిస్కషన్స్ కు మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. 2022లో విడుదలైన ఈ సినిమాకు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ అవసరం కాగా, ప్రైమ్ ఫోకస్(Prime Focus) కూడా ఆ నిర్మాణంలో భాగమైంది. ఇప్పుడు రామాయణ వంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో వీఎఫ్ఎక్స్ రంగంలో మరింత విస్తరించిన సంస్థ.. బ్రహ్మాస్త్ర2కు కూడా కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉందనే డిస్కషన్ మొదలైంది.
ఇక తొలి భాగంతో బాండింగ్ ఉన్న ధర్మ ప్రొడక్షన్స్(Dharma Productions) సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో అయాన్ కొత్త స్టూడియో కోసం అన్వేషణ కొనసాగించారు. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films)తోనూ డిస్కషన్స్ జరిగినప్పటికీ అవి ముందుకు సాగలేదు. అనంతరం జియో స్టూడియోస్(Jio Studios)తో డిస్కషన్స్ జరిగినా, ఆ సంస్థ సీక్వెల్లో పెట్టుబడి పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రైమ్ ఫోకస్‌తో డీల్ కుదిరితే బ్రహ్మాస్త్ర2(brahmastar2) నిర్మాణానికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయాన్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పై దృష్టి పెట్టగా, రణ్‌బీర్ కపూర్(ranbir Kapoor) రామాయణ(Ramayana) పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 2027లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఆలియా భట్(Alia Bhatt) మరోసారి ఈషా(eesha) పాత్రలో కనిపించనుంది.








