అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని నిజామాబాద్‌లోని గోపన్‌పల్లికి చెందిన రాహుల్ (Rahul)గా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు కుటుంబసభ్యులకు ఈ సమాచారం అందింది. ఉన్నత చదువుల కోసం మÖడు నెలల క్రితం అమెరికా (America) వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు హరిబాబు ( Haribabu), నాగమణి (Nagamani) కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాద సమయంలో కారులో రాహుల్‌తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలిసింది వీరిలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోగా, మరో యువకుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరి విరాలు వెల్లడి కావాల్సి ఉంది.








