ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు (Tallapragada Mallikarjuna Rao) రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) జస్టిస్ మల్లికార్జునరావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ , సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు. పలువురు న్యాయాధికారులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు లోక్భవన్కి తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు గవర్నర్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas), అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.








