బీసీలు బాగుపడటం ఆయనకు ఇష్టం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర
ఎల్‌నినోపై అసెంబ్లీలో చర్చకు వస్తే వైసీపీ ఐదేళ్ల పాలనలోని వాస్తవాలు బయటపడతాయనే జగన్ సభకు రాకుండా ప్రెస్మీట్లు పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. జగన్ (Jagan) హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. చంద్రబాబు (Chandrababu) ముందుచూపుతో జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం వల్లే ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు. గతంలో పట్టిసీమ (Pattiseema)ను విమర్శించిన జగన్, ఇప్పుడు దాని ప్రయోజనాలను చూడాలన్నారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని, 102 టెండర్లు రద్దు చేశారని ఆరోపించారు. బీసీ ( BC) లు బాగుపడటం ఆయనకు ఇష్టం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోతపై గతంలో పట్టించుకోని వ్యక్తికి ఇప్పుడు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. మద్యం రవాణా కుంభకోణంలో వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) అడ్డంగా దొరికితే, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ కార్డును వాడుతున్నారని ధ్వజమెత్తారు.








