నేపాల్ వరదలు.. ఏపీ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు.. ఫోన్ నంబర్లు ఇవే
నేపాల్ (Nepal)లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) అధికారులను ఆదేశించారు. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా? అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ( AP Bhavan)లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ (RTG) ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, నేపాల్‌లోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులకు అవసరమైన సహకారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ 011-23384016, 011- 23387089 నంబర్లను, వాట్సాప్ 9059824101 ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.








