కోటంరెడ్డికి మంత్రి లోకేశ్ అభినందనలు
జెన్ -జీ (Gen-Z)యువతతో నిరంతరం మమేకమై వారి ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. యువత అభిప్రాయాల ఆధారంగా వారికి ప్రయోజన చేకూర్చేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. నెల్లూరు (Nellore) గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) నిర్వహిస్తున్న జెన్ -జీ యువతతో మాటామంతి కార్యక్రమంపై లోకేశ్ స్పందించారు. యువతతో జరగనున్న ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన భావ వినిమయ కార్యక్రమం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.








