ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్.. డల్లాస్‌లో నాని, అనిరుధ్ మాస్ ట్రీట్
నేచురల్ స్టార్ నాని(nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ది ప్యారడైజ్(the Paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్రబృందం సెకండ్ సింగిల్‌ను వినూత్నంగా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ అందిస్తున్న ఈ సాంగ్‌ను ఏకంగా డల్లాస్‌లో లైవ్‌గా ఆవిష్కరించనున్నారు.
అనిరుధ్ ఆగస్టు 28న డల్లాస్‌లో నిర్వహించనున్న తన కాన్సర్ట్‌లో ఈ ఎనర్జిటిక్ ఫోక్ మాస్ ఆంథమ్‌ను తొలిసారి లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి నాని కూడా ప్రత్యేకంగా హాజరుకానుండటంతో ఫ్యాన్స్ కు మరింత స్పెషల్ ట్రీట్ దక్కనుంది. సాధారణంగా సినిమా పాటలను యూట్యూబ్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విడుదల చేసే విధానానికి భిన్నంగా, వేలాది మంది అభిమానుల సమక్షంలో లైవ్‌గా పరిచయం చేయడం ది ప్యారడైజ్ టీమ్ ప్రమోషన్లో కొత్త ట్రెండ్‌గా నిలిచే అవకాశం ఉంది.
డల్లాస్ కాన్సర్ట్ తర్వాత ఆగస్టు 29న ఈ సాంగ్ ను వరల్డ్ వైడ్‌గా అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆయా షేర్(aaya sher) సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై మ్యూజిక్ పరంగా భారీ అంచనాలను పెంచింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా అదే స్థాయిలో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది. అనిరుధ్ మ్యూజిక్కు నాని క్రేజ్ జతకావడంతో ఈ సాంగ్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
మోహన్ బాబు(mohan babu), కాయదు లోహర్(kayadhu lohar), రాఘవ్ జుయల్(Raghav Juyal) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ది ప్యారడైజ్ ను పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నమైన కథ, భారీ ప్రొడక్షన్ వాల్యూస్, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం, అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలవనున్నాయి. సెప్టెంబర్ 24న పలు భాషల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








