పిల్లల స్విమ్‌సూట్ కొనేటప్పుడు ఈ తప్పు చేయకండి.. ప్రమాదం!
వేసవి వచ్చిందంటే పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు పంపడం.. వీకెండ్లో ఫ్యామిలీతో స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లడం.. హాలిడే అయితే బీచ్‌లో సరదాగా గడపడం కామన్. పిల్లలు నీటిలోకి దిగగానే తల్లిదండ్రుల కళ్లన్నీ వాళ్లపైనే ఉంటాయి. కానీ ఒక చిన్న విషయం మాత్రం చాలామంది అసలు పట్టించుకోరు.
నీటిలో పిల్లలను ఎంత త్వరగా గుర్తించగలమన్నది.. వాళ్లు వేసుకున్న స్విమ్సూట్పై కూడా ఆధారపడి ఉంటుందని తెలుసా?
మనం స్విమ్‌సూట్ కొనేటప్పుడు కలర్ఫుల్గా ఉందా, పిల్లలకు నచ్చిందా, ఫిట్‌గా ఉందా అనే విషయాలే చూస్తాం. కానీ నీటిలోకి వెళ్లిన తర్వాత అదే రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోయి.. పిల్లలు కనిపించకుండా చేస్తే?
ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్‌లోనే కాదు.. బీచ్‌లు, రిసార్ట్స్, వాటర్ పార్క్స్లోనూ ఈ చిన్న విషయం ఉపయోగపడొచ్చు. మరి నీటిలో ఏ రంగులు కంటికి కనిపించకుండా పోతాయి? ఏ రంగు మాత్రం దూరం నుంచే సులభంగా గుర్తించొచ్చు? ఈ విషయం తెలిసిన తర్వాత పిల్లల స్విమ్‌సూట్ కొనేటప్పుడు మీరు కలర్‌ను అంత ఈజీగా ఎంచుకోరు.
ఈతకు వెళ్లేటప్పుడు డ్రెస్ ఎలా కనిపిస్తుంది? ఫిట్‌గా ఉందా? స్టైలిష్‌గా ఉందా? అనే విషయాలే మనం ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ నీటిలోకి దిగిన తర్వాత అదే డ్రెస్ రంగు మనకు ఎంతవరకు కనిపించేలా చేస్తుంది అన్నది కూడా చాలా ముఖ్యం.
ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ విషయం మరింత కీలకం. నీటిలో ప్రమాదం జరిగినప్పుడు ప్రతి సెకను విలువైనదే. ఒక వ్యక్తిని కొన్ని సెకన్ల ముందే గుర్తిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు.
అసలు ప్రమాదం రంగులోనే ఎందుకు ఉంది?
నీటిలో ఒక వ్యక్తి కనిపించడం అనేది కేవలం అతను ఎక్కడ ఉన్నాడన్నదానిపై ఆధారపడదు. అతను వేసుకున్న దుస్తుల రంగు కూడా ప్రభావం చూపుతుంది.
లేత ఆకుపచ్చ, లేత నీలం, తెలుపు వంటి రంగులు నీటి రంగుతో కలిసిపోయే అవకాశం ఉంది. డార్క్ బ్లూ, బ్లాక్ వంటి రంగులు కూడా కొన్ని నీటి పరిస్థితుల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోతాయి.
దీంతో నీటిలో ఉన్న వ్యక్తిని దూరం నుంచి గుర్తించడం కష్టమవుతుంది. ఒక వ్యక్తి సాధారణంగా ఈత కొడుతూ ఉంటే ఇది పెద్ద సమస్యలా అనిపించకపోవచ్చు. కానీ అతను ఒక్కసారిగా మునిగిపోయినా, కదలకుండా నీటిలో ఉన్నా, చుట్టుపక్కల వాళ్లు వెంటనే గుర్తించకపోవచ్చు.
అదే అసలు ప్రమాదం.
మరి ఏ రంగు వేసుకుంటే మంచిది?
ఇక్కడ నిపుణుల సలహా చాలా సింపుల్‌గా ఉంది. బ్రైట్ నియాన్ రంగులు ఎంచుకోవాలి. ముఖ్యంగా నియాన్ ఆరెంజ్, నియాన్ ఎల్లో రంగులు నీటిలో ఎక్కువగా కనిపించే రంగులుగా గుర్తించారు. పూల్ అయినా, ఓపెన్ వాటర్ అయినా.. చుట్టూ ఉన్న నీటి రంగుతో పోలిస్తే ఈ ప్రకాశవంతమైన రంగులు ఎక్కువ కాంట్రాస్ట్ ఇస్తాయి.
అందుకే పిల్లలకు స్విమ్‌సూట్ కొనేటప్పుడు కేవలం వారికి నచ్చిన కలర్‌నే చూడకుండా, నీటిలో అది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కూడా చూడటం మంచిది.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి
ఇక్కడే చాలామంది పొరపడే అవకాశం ఉంది. బ్రైట్ కలర్ స్విమ్‌సూట్ వేసుకుంటే ప్రమాదం ఉండదని కాదు. నీటిలో అలలు, రిపుల్స్, నీటి కదలిక ఎక్కువగా ఉన్నప్పుడు ఉపరితలం కింద ఉన్న వ్యక్తిని గుర్తించడం చాలా కష్టమవుతుంది. కొద్దిగా లోతులోకి వెళ్లిన తర్వాత ప్రకాశవంతమైన రంగు కూడా అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు.
అందుకే స్విమ్‌సూట్ రంగు ఒక అదనపు భద్రతా చర్య మాత్రమే. అది లైఫ్ జాకెట్‌కు, పర్యవేక్షణకు, ఈత శిక్షణకు ప్రత్యామ్నాయం కాదు.
ఎల్లో కలర్ వేసుకుంటే షార్క్ వస్తుందా?
ఇక్కడ మరో మరో ముఖ్యమైన విషయం ఉంది. సముద్రంలో ఈత కొట్టేటప్పుడు చాలా ఎక్కువ కాంట్రాస్ట్ ఉన్న డిజైన్లు, ముఖ్యంగా లైట్-డార్క్ స్ట్రైప్స్ లేదా చెక్స్ ఉన్న స్విమ్సూట్లను దూరంగా పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే సముద్రంలో ఈతకు వెళ్లేటప్పుడు మెరిసే నగలు, వాచ్‌లు ధరించకపోవడం కూడా మంచిది. వాటి నుంచి వచ్చే కాంతి ప్రతిబింబాలు చేపల పొలుసుల్లా కనిపించే అవకాశం ఉంటుంది. రకరకాల సముద్ర జంతువులను ఎట్రాక్ట్ చేస్తాయి.
పిల్లల విషయంలో మరింత జాగ్రత్త
పిల్లల కోసం స్విమ్‌సూట్ కొనేటప్పుడు ఈ చిన్న విషయం గుర్తుపెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది.
నీటిలో కలిసిపోయే లేత నీలం, లేత ఆకుపచ్చ, తెలుపు లేదా చాలా డార్క్ కలర్స్ కంటే.. నీటికి స్పష్టంగా కాంట్రాస్ట్ ఇచ్చే నియాన్ ఆరెంజ్, నియాన్ ఎల్లో వంటి బ్రైట్ కలర్స్ మంచివి.
అయితే దానికంటే ముఖ్యమైనది పిల్లలను నీటిలో ఒంటరిగా వదిలేయకపోవడం. అవసరమైనప్పుడు సరైన లైఫ్ జాకెట్ వేయాలి. ఈత నేర్పించాలి. లైఫ్‌గార్డ్ ఉన్న ప్రాంతాల్లోనే ఈత కొట్టాలి. నీటిలో ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే స్పందించాలి.
కంక్లూజన్
స్విమ్‌సూట్ రంగు అనేది ఇప్పటివరకు మనం ఫ్యాషన్ విషయంగా మాత్రమే చూసి ఉండొచ్చు. కానీ నీటిలోకి వెళ్లిన తర్వాత అది విజిబిలిటీకి సంబంధించిన భద్రతా అంశంగా మారుతుంది.
నీటిలో ప్రమాదం జరిగినప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే.. బాధితుడు సహాయం కోసం అరవడానికి లేదా చేతులు ఊపడానికి కూడా అవకాశం లేకపోవచ్చు. అందుకే అతను కనిపించడం ఎంత త్వరగా జరుగుతుందో అంత ముఖ్యమైనది.
కాబట్టి ఈసారి స్విమ్‌సూట్ కొనేటప్పుడు ఒక చిన్న మార్పు చేయండి.
“నాకు ఏ రంగు నచ్చుతుంది?” అని మాత్రమే కాకుండా.. “నీటిలో నేను ఏ రంగులో స్పష్టంగా కనిపిస్తాను?” అని కూడా ఆలోచించండి. ఎందుకంటే నీటిలో కొన్ని సందర్భాల్లో స్టైల్ కంటే విజిబిలిటీ ముఖ్యం.. విజిబిలిటీ కంటే ప్రాణం ముఖ్యం.








