మహాబలి వేషధారణలో రోబో… ఓనం వేడుకల్లో చిందులు
ఇప్పుడు నడుస్తుందంతా AI యుగమే. దీంతో ఏమైనా చేయవచ్చు. అయితే.. కేరళలోని కొచ్చిలో వున్న ఫోరమ్ మాల్ లో మహాబలి వేషధారణలో వున్న AI ఆధారిత హ్యుమనాయిడ్ రోబో సంప్రదాయ శైలిలో నృత్యం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.
అయితే.. ఓనం పండగ సందర్భంగా ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ దృశ్యం కేరళ వాసులతో పాటు దేశ వ్యాప్తంగా వున్న ప్రజలను ఆకర్షిస్తోంది. సంప్రదాయ ఓనంతో పాటు ఆధునిక, సాంకేతికతతో కూడిన ఓనంను కూడా అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.
ఓనం వేడుకల్లో కనిపించే ప్రసిద్ధ ‘మహాబలి చక్రవర్తి’ రూపాన్ని పోలి ఉండేలా, సంప్రదాయ నారింజ రంగు ధోతీ మరియు బంగారు ఆభరణాలను ధరించిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్ కనిపిస్తోంది. మాల్ లోని ఓ రెడ్ కార్పెట్ పై నిలబడి, సంగీతానికి అనుగుణంగా ఈ రోబో నృత్యం చేస్తోంది. యూనిట్రీ రోబోటిక్స్’ (Unitree Robotics) సంస్థ ఈ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించగా, ఈ ప్రత్యేక సందర్భం కోసం దీనికి ‘రోబో మావెలి’ (Robo Maveli) అని పేరు పెట్టారు.
కేరళలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో ఓణం ఒకటి; పురాణ ప్రసిద్ధుడైన మహాబలి చక్రవర్తి ఏటా స్వదేశానికి తిరిగి రావడంతో ఈ పండుగకు సాంప్రదాయక సంబంధం ఉంది.
సాధారణంగా మావెలిని రాజసం ఉట్టిపడే సాంప్రదాయక వస్త్రధారణలో చిత్రీకరిస్తుంటారు. ఆయన రాకను వేడుకలు, పూల అలంకరణలు, విందులు, సంగీతం మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా జరుపుకుంటారు.
ఓనం ఉత్సాహం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చినప్పుడు… రోబోలు కూడా ఆ సంబరాల్లో భాగమవుతాయి! అందరికీ ఆనందంతో, నవ్వులతో నిండిన ఓనం శుభాకాంక్షలు!” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.








