రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
రాఖీ (Rakhi) పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్రంలోని అక్కచెల్లెళ్ళలకు శుభాకాంక్షలు (Best wishes) తెలిపారు. అన్నాచెల్లెళ్లు ( Brothers Sisters), అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు.








