గవర్నర్కు అస్వస్థత.. పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఛాతిలో అసౌకర్యంగా ఉండటంతో వెంటనే హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి ( Yashoda Hospital)లో చేరారు. అత్యవసర విభాగంలో చేర్పించిన వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేశారు. కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు డాక్టర్ వరదరాజశేఖర్ బృందం గవర్నర్కు వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండె రక్తనాళంలో ఒక బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని తొలగించేందుకు స్టంట్ వేశారు. గురువారం ఆయన కోలువోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అంతకుముందు గవర్నర్ ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy), ఎంపీ వేం నరేందర్ రెడ్డి (Vem Narendar Reddy) ఆసుపత్రికి వెళ్లి గవర్నర్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడి గవర్నర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. రక్తనాళంలో చిన్న బ్లాక్ ఉండటంతో స్టంట్ వేశామని, ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు సీఎంకు వివరించారు.








