2026–2027 విద్యా సంవత్సరానికి తానా పాఠశాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
“దేశ భాషలందు తెలుగు లెస్స… మన తెలుగు – మన పిల్లల కోసం!” అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తానా పాఠశాల (TANA Paatasala) 2026–2027 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలను ప్రారంభించింది.
తరతరాలకు మన మాతృభాషను, సంస్కృతి సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠ్యాంశాలతో పిల్లలకు సరదాగా తెలుగు నేర్పించే ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోర్సులు :
తెలుగు పలుకు (Level 1)
తెలుగు అడుగు (Level 2)
తెలుగు పరుగు (Level 3)
తెలుగు వెలుగు (Level 4)
నమోదు వివరాలు:
రిజిస్ట్రేషన్ లింక్: https://paatasala.tana.org/registration
ఈమెయిల్: [email protected]
ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు , ఇతర తెలుగు కుటుంబాలతో పంచుకోవడం ద్వారా మరిన్ని పిల్లలు మాతృభాషను అభ్యసించేలా సహకరించాలని తానా అప్పీల్ చేసింది.
నిర్వాహక వర్గం:
నరేన్ కొడాలి (అధ్యక్షులు – TANA President)
శ్రీనివాస్ లావు (ఇవిపి – EVP)
భాను మగులూరి (పాఠశాల చైర్ – Paatasala Chair)
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
ప్రసాద్ మంగిన: +1-408-499-6530
రావు యలమంచిలి: +1 (203) 815-7627
రజని మరం: +1 (301) 537-5001
శ్రీనివాసులు పనుగంటి: +1 (732) 925-9341
సునీల్ దేవరపల్లి: +1 (404) 536-1183
కె. శేఖర్ చంద్ర: +91 9030549211








