ఇబ్బందులు వున్నా.. 7.8శాతం వృద్ధి రేటు.. ప్రధాని శుభాకాంక్షలు
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటనలో వున్నారు. అక్కడి నుంచే ఆయన దీనిపై వీడియో విడుదల చేశారు. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు.
7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నా భారత్ వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు.
భారత దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు దేశ ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని అన్నారు. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచించారు. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వుంటే స్వాంత్రం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం తనకు వుందన్నారు.








