బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు హౌస్ అరెస్టు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు ( House Arrest) చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్టు ప్రకటించడంతో ఆయన్ను గృహనిర్బంధం చేసినట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాలో నిన్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. నల్గొండలో మంత్రి కోమటి రెడ్డి కార్యాలయం (Komatireddy office) పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయగా, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి (Varshit Reddy) నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు.








