కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ..
హైదరాబాద్ విశ్వనగరంగా మారి విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు ఐటీ, సినిమా పరిశ్రమలకు అవకాశం ఇచ్చింది..
హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడేలా ముందుకు పోతోంది..
ఎంత వేగంగా జనాభా పెరుగుతుందో, అంత వేగంగా మౌలిక వసతులను పెంచుకోలేకపోతున్నాం..
హైదరాబాద్, తెలంగాణను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నాం..
తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని విభజించాం..
క్యూర్లో సర్వీస్ సెక్టార్, ప్యూర్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, రేర్‌లో అగ్రికల్చర్ సెక్టార్‌ను అభివృద్ధి చేస్తున్నాం..
అంబర్‌పేట నియోజకవర్గం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది..
ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు లేవు..
మూసీ మురికి ఒక వైపు, వరదలు మరో వైపు అంబర్‌పేటను ఇబ్బందిపెడుతున్నాయి..
చిన్న వర్షం వచ్చినా మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద వచ్చేది.. అనేక మంది ప్రాణాలు పోయాయి..
పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు బ్రిడ్జి కట్టలేదు..?
రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకున్నాం..
ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.. పదేళ్లలో అంబర్‌పేటలో ఇళ్లు కట్టించి ఇచ్చారా..?
పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తే ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చేది..
కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను దళారులకు ఇచ్చారు.. పేదలకు కాదు..
ఎక్కడి వారికి అక్కడే ఇళ్లు కట్టి ఇస్తే ప్రయోజనం ఉంటుంది..
అంబర్‌పేటలో పదెకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం..
బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..?
ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరో అందరికీ తెలుసు..
బతుకమ్మ కుంటను పునరుద్ధరించాం.. ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరాయి..
బతుకమ్మ కుంటకు వచ్చి విమలక్క పాటలు పాడింది..
ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే ఆయన బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు..
ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆలోచించాలి..
బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మీకే అప్పగించాం..
హైడ్రాను తెచ్చానని నాపై ఆరోపణలు చేసి నిందిస్తున్నారు..
ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలి..
పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది..
ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 1000 రోజులు పూర్తి చేసుకున్నాం..
ప్రజా పాలన వచ్చి ఇప్పటికి 1000 రోజులైంది..
1000 రోజుల ప్రజా పాలనపై మేం కార్యాచరణ తీసుకున్నాం.. నిరసన తెలుపుతామని కొందరు బయలుదేరారు..
పదేళ్లు తెలంగాణను నడిపించిన వాళ్లు, కబళించిన వాళ్లు ఇప్పుడు నిరసనలు తెలుపుతామంటున్నారు..
2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి సెక్రటేరియట్‌కు వెళ్లి సమీక్ష చేస్తే 11 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు..
ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని చెప్పారు..
16 వేల కోట్ల మిగులుతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు తెలంగాణను అప్పగించింది..
ఏడాదికి 6,500 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తే సరిపోయేది..
తొమ్మిదిన్నర ఏళ్లలో ఒకే ఒక కుటుంబం 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లో తెలంగాణను నిండా ముంచింది..
జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చింది..
60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు 70 వేల కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ఒక్కడే తొమ్మిదిన్నర ఏళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేశాడు..
నెలకు 7,500 కోట్ల అసలు, మిత్తి చెల్లించాల్సి వస్తోంది..
ఏడాదికి 85 వేల కోట్ల అసలు, మిత్తి చెల్లించే పరిస్థితుల్లోకి నెట్టారు..
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమస్యలను నేను అర్థం చేసుకుంటా..
32 నెలల్లో ఎప్పుడైనా 1వ తేదీన జీతాలు ఇవ్వకుండా ఆపామా..?
ఉద్యోగులు ఆలోచించాలి..
తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా ఒకటో తేదీనే జీతాలు వేశాం..
ఏ బ్యాంకులు నమ్మడం లేదని ఉద్యోగులు నా దగ్గరకు వచ్చారు..
ఆనాడు ఎలా ఉంది.. ఈనాడు ఎలా ఉందో ఉద్యోగులు ఆలోచించాలి..
ఐదున్నర లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదో తేదీనే జీతాలు ఇస్తున్నాం..
గతంలో ఆరు నెలలకొకసారి జీతాలు ఇచ్చేవాళ్లం.. కానీ ఐదో తేదీనే జీతాలు ఇస్తున్నాం..
61 ఏళ్లకు ఉద్యోగ వయోపరిమితి పెంచడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ మా ప్రభుత్వంపై పడ్డాయి..
8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు కేసీఆర్ పెట్టిపోయాడు..
రెండు నెలల్లో 6 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేశాం..
ఉద్యోగులు, వాళ్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించాం..
కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 60 మంది చనిపోతే కనీసం కన్నీరు కార్చలేదు..
ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు బయటకు రాలేదు..
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం..
32 నెలల్లో 11 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది..
అమ్మవారి ఇంటికి పోయినా, అమ్మోరు దర్శనానికి వెళ్లినా ఒక పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు..
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..
విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నా..
25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం..
ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది..
ప్రభుత్వ స్కూళ్లలో లక్ష అడ్మిషన్లు పెరిగాయి..
28వ స్థానంలో ఉన్న తెలంగాణను 18వ స్థానానికి తీసుకువచ్చాం..
10 ఏళ్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టలేదు..
నోటిఫికేషన్లు ఇవ్వాలి, ప్రశ్నాపత్రాలు ముద్రించి లీక్ చేయాలి.. ఇదే గత ప్రభుత్వ విధానం..
1000 రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాల భర్తీ చేశాం..
ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం..
స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశాం..
1.70 లక్షల కోట్ల రూపాయలను 1000 రోజుల్లో రైతుల కోసం ఖర్చు చేశాం..
కేసీఆర్ వరి వేసుకుంటే ఉరేనని అన్నాడు..
20,617 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేశాం..
30 వేల కోట్ల రూపాయలను ఉచిత రైతు విద్యుత్ కోసం ఖర్చు చేశాం..
తెలంగాణలో అప్పులు లేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్ చెప్పింది..
కోహెడలో అంతర్జాతీయ స్థాయి కొత్త పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నాం..
కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకుని మహిళలు ఏనాడైనా బయటకు వచ్చారా..?
పిట్టలను బెదిరించడానికి ఆ నాడు చీరలు కట్టారు..
కమిషన్లకు కక్కుర్తిపడి ఆడబిడ్డలకు నాసిరకం చీరలు ఇచ్చారు..
కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం..
ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదిస్తున్నారు..
మీ బతుకులు బతుకమ్మ చీరల్లో ఉన్నాయి.. మా గొప్పలు ఇందిరమ్మ చీరల్లో ఉన్నాయి..
మీ బతుకులు చెడా.. నిరసన కార్యక్రమాలు చేస్తారా..?
2,100 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ కింద బ్యాంకులకు చెల్లించాం..
మహిళా సంఘాలకు 1,000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశాం..
బస్సులకు యజమానులుగా మా ఆడబిడ్డలను చేశాను..
ఆడబిడ్డలకు ప్రభుత్వ భూములు ఇచ్చి పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తున్నాం..
హైటెక్ సిటీ పక్కన మహిళా సంఘాలకు 1,000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల్లో వాళ్ల ఉత్పత్తుల విక్రయాల కోసం ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ఏర్పాటు చేశాం..
మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను అమెజాన్‌లో అమ్ముతున్నారు..
ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నాం..
అడిగిన వాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం.. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం..
మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం..
మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందిలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఉన్నారు.. సన్నబియ్యం తింటూ విమర్శలు చేస్తున్నారు..
కేసీఆర్ ఏనాడైనా ఆలోచించాడా..?
7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.. హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం..
ప్రజా పాలన అంటే ఇది కదా..
1000 ఎకరాల్లో కేసీఆర్, 100 ఎకరాల్లో కేటీఆర్, జన్వాడలో 50 ఎకరాల్లో కవిత ఫామ్‌హౌస్ కట్టుకున్నారు..
పేదల ఆత్మగౌరవం అయిన రేషన్ కార్డు ఇవ్వాలని ఏనాడైనా ఆలోచించారా..?
సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,500 కోట్లు ఖర్చు పెట్టాం..
త్వరలోనే ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకోబోతున్నాం..
ఉస్మానియా ఆస్పత్రి వరదల్లో మునిగిపోతే 2,000 కోట్లు పెట్టి కొత్త ఆస్పత్రి కట్టాలని ఆలోచన ఎందుకు చేయలేదు..?
మా ప్రభుత్వం 2,000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తోంది..
మర్రి చెన్నారెడ్డి కాలి గోటికి కూడా సరిపోరు..
అల్వాల్ టిమ్స్ ఆస్పత్రికి మాజీ సీఎం అంజయ్య పేరు పెడతాం..
ఎల్బీ నగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ పేరు పెడతాం..
వరంగల్ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతాం..
మీ పేర్లు పెట్టాలి, పోతే మీ విగ్రహాలు పెట్టాలన్నదే మీ ఆలోచన..
సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం తీస్తామంటున్నారు.. ముట్టుకోండి చూస్తాం..
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు.. సెక్రటేరియట్ ముందు మేం పెట్టాం..
మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని నెక్లెస్ రోడ్డులో పెట్టాం..
ఇది మా పరిపాలన వైఫల్యమా..?
శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను అనాథలా రోడ్డుమీద పడేస్తే మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశాను..
వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీకి పెట్టాను..
చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిని చేశాను..
నాకు, మీకు పోలికనా..?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కొడుకు, అల్లుడిని మంత్రినిచేశారు..
నేను పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని మంత్రులు చేశాను..
నేను సీఎం అయితే వి. హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా చేశాను.. అనిల్ యాదవ్‌ను ఎంపీ చేశాను..
ఎర్రబెల్లి దయాకర్‌ను మంత్రిని చేశావు.. నేను అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రి చేశాను..
కేసీఆర్ వెంకట్ రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తే, నేను అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ చేశాను..
కేసీఆర్ తన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే, నేను బలహీన వర్గాల బిడ్డ మహేష్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేశాను..
1000 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాను..
1931లో బ్రిటిష్ వాళ్లు కులగణన చేస్తే, మళ్లీ 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో బీసీ కులగణన చేసి మోదీకి సవాల్ విసిరాం..
గిగ్ వర్కర్ల కోసం పాలసీ తెచ్చాం..
స్పోర్ట్స్, ఐటీ, టూరిజం, ఎండోమెంట్ పాలసీ తీసుకువచ్చాం..
1000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కేసీఆర్ తీసుకున్నాడు..
ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారు.. మరి కేసీఆర్‌ను ఏం చేయాలి..?
ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది..
1000 రోజుల్లో పేదలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, రైతులు, దళితులు, ఆదివాసీల కోసం ఒక్క రోజైనా పనిచేశావా..?
మనమడు ఆస్పత్రికి వెళ్తే, బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప బయటకు రాలేదు..
1000 రోజుల్లో ఒక్క గంటైనా సెలవు తీసుకోలేదు.. 1000 రోజుల్లో ఒక్కరోజైనా పనిచేశావా.. నీకు, నాకు పోలికనా..?
నందికి, పందికి ఉన్న తేడా ఉంది..
1000 రోజులు ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలి..
పందికొక్కుల్లా తిని ఫామ్‌హౌస్ నుంచి బయటకు రారా..?
దేశంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు 1000 రోజులు బయటకు రాకుండా ఉన్నారా..?
ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందిన రాష్ట్రం తెలంగాణ..
తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం పెట్టి కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకున్న దుర్మార్గులు..
అగ్గిపెట్టెరావుకు ఆనాడు పది పైసల అగ్గిపెట్టె దొరకలేదు..
ఇరవై రెండు కోట్ల నాలుగు లక్షల నలభై వేల జీతం తీసుకున్న ప్రతిపక్ష నాయకుడు వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు తెలపాలి..
6న ఇందిరా పార్క్‌లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి..
7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ల ఎదురుగానే అన్ని విషయాలు చెప్తా..
తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలి..
పదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడో, 1000 రోజుల్లో నేను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధం..
ఏనాడూ పదవిని దుర్వినియోగం చేయలేదు.. చేయను..
తెలంగాణ ఉద్యమంలో నేను, నా ముసల్ది అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని దించాడు..
గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారు..
రేపటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలి..








