డిజైనర్ అవుట్‌ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న పాలక్
బాలీవుడ్ భామ పాలక్ తివారీ(Palak Tiwari) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలతో కంటే డేటింగ్ వ్యవహారాలతోనే ఎక్కువగా పాపులరైన ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె తన ఫ్యాషన్ సెన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే పాలక్ తాజాగా ఓ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతూ పాలక్ అందం ఈ అవుట్‌ఫిట్ లో మరింత రెట్టింపైందని కామెంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.








