రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఇంకా బ్యాలెన్స్లోనే వెంకీ సినిమా షూట్!
విక్టరీ వెంకటేష్(Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(aadarsha kutumbam) సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో మొదటి నుంచే ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. అక్టోబర్ 2, 2026న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే డేట్‌ను లాక్ చేశారు. అయితే రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.
ఇదే సమయంలో సినిమాలోని మరో సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉందట. ఈ సాంగ్‌ను సెప్టెంబర్ సెకండ్ వీక్ లో షూట్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు షూటింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మేకర్స్ వేగవంతం చేసినట్లు సమాచారం. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉంటూనే, త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్(nivetha peturaj), యువిన్(Yuvin), రాజ్ ప్రజ్పల్(Raj Prajphal), రావు రమేష్(Rao Ramesh), సత్య(Satya), బ్రహ్మాజీ(Brahmaji) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika and Haassinee Creations) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా అనుకున్న సమయానికి ముగించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. షూటింగ్లో ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అక్టోబర్ 2 రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి మార్పు చేయకుండా ముందుకు సాగుతున్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.








