రామ్ సైలెంట్ గా జాయిన్ అయిపోయాడా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth), డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు(Aswath marimuthu) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ధర్మన్(Dharman) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ ఓ డెడ్లీ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి టాలీవుడ్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
యంగ్ హీరో రామ్ పోతినేని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆయనది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రామ్ ఈ షూటింగ్లో భాగమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తన దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ పనులతో బిజీగా ఉన్నప్పటికీ, రజినీకాంత్ సినిమాకు కూడా టైమ్ కేటాయిస్తూ షూటింగ్లో పాల్గొంటున్నారనే సమాచారం ఆసక్తిని పెంచుతోంది.
ముఖ్యంగా ధర్మన్ లో రామ్ క్యారెక్టర్ నిడివి పరంగా మాత్రమే కాకుండా కథలోనూ కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రజినీకాంత్ వంటి సీనియర్ స్టార్‌తో రామ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త నిజమైతే, ఈ కాంబినేషన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారే అవకాశం ఉంది. అయితే రామ్ పాత్ర స్వరూపం, నెగెటివ్ రోల్‌పై వస్తున్న ప్రచారం, ఆయన షూటింగ్లో నిజంగానే పాల్గొన్నారా అనే అంశాలపై చిత్రబృందం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్తలను ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారంగానే చూడాలి.








