ఫ్రెషర్లకు అమెరికా డోర్స్ క్లోజ్? కంపెనీల చేత ‘నో’ చెప్పించే కొత్త ప్లాన్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“Bro… H-1B వస్తే హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు!”
ఇన్నాళ్లుగా మన దేశంలో చాలామంది యంగ్ ఐటీ ప్రొఫెషనల్స్ కెరీర్ ప్లాన్ దాదాపు ఇలాగే ఉంటూ వస్తోంది. కాలేజీ కంప్లీట్ చేయాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలి. రెండుమూడేళ్లు ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. తర్వాత అమెరికా ఛాన్స్ వస్తే… అంతే, నెక్స్ట్ లెవల్! కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌లో ఒక కొత్త ట్విస్ట్ పడేలా కనిపిస్తోంది.
ఎందుకంటే అమెరికా ప్రభుత్వ లెక్కలు మారుతున్నాయి. రోజు రోజుకూ మన వాళ్ల అమెరికా ప్రయాణానికి అడ్డంకులు వెతుకుతోంది. డైరెక్ట్ గా నోటితో నో చెప్పదు..కంపెనీల చేతో లేక మరో రూల్ పెట్టి అమెరికా కలకు గండి కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ కొత్త ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వం తెస్తోంది.
ఆ కొత్త ప్రతిపాదన ఏమిటి
అమెరికా డైరెక్ట్ గా “మీరు రావద్దు” అని చెప్పదు. కానీ మిమ్మల్ని తీసుకెళ్లడం కంపెనీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చితే?. చివరికి “వద్దులే… లోకల్‌గా ఎవరినైనా తీసుకుందాం” అనే సదరు కంపెనీలే చెప్పే పరిస్థితి రావచ్చు.అదే ప్రభుత్వం క్రియేట్ చేయబోతోంది.
అంటే హెచ్-1బీ వీసాలను రద్దు చేయటం లేదు. విదేశీ ఉద్యోగులకు అమెరికా డోర్స్ క్లోజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించలేదు. కానీ విదేశాల నుంచి ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీ చెల్లించాల్సిన కనీస జీతాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదిస్తోంది.పైనుంచి చూస్తే సమానత్వ సిద్దాంతంలా..అందరినీ ఒకేలా చూడాలనే ఆలోచనలా కనపడుతుంది.దాని వెనక ఉన్న ఐడియాలజీ మాత్రం మనవాళ్లకు మంట పెట్టేలా ఉంది.
అసలు కొత్త రూల్ ఏంటి?
హెచ్-1బీ వీసాపై విదేశీ ఉద్యోగిని అమెరికాకు తీసుకోవాలంటే కంపెనీ వేతన నిబంధనలను పాటించాలి. ఓకే పాటిద్దాం అంటాయి కంపెనీలు. ఇప్పుడు అసలైన ట్విస్ట్. ఆ కనీస వేతన స్థాయిలనే మార్చాలని,పెంచాలని అమెరికా కార్మిక శాఖ అంటోంది.
ఎంట్రీ లెవల్ నుంచి అత్యంత అనుభవం ఉన్న ఉద్యోగుల వరకు నాలుగు వేతన స్థాయిలను పెంచాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల విషయంలో మార్పు పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం వారి వార్షిక కనీస వేతనం సుమారు 98 వేల డాలర్ల వరకు వెళ్లవచ్చు. ఇది పాత స్థాయితో పోలిస్తే సుమారు 33 శాతం పెంపు. అయితే అమెరికాలో అన్ని నగరాల్లో ఒకే వేతనం ఉండదు. ఉద్యోగం చేసే ప్రాంతం, అక్కడి మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ మొత్తం మారుతుంది.
ఇప్పుడు మీకు రావాల్సిన క్లారిటీ… “అమెరికాలో ఉద్యోగం చేయాలంటే ముందుగా వీసా రావాలి అనుకుంటాం. కానీ త్వరలో మరో ప్రశ్న కూడా ఎదురుకావచ్చు. ‘వీసా సంగతి తర్వాత… నిన్ను అమెరికాకు తీసుకెళ్లడానికి ఇంత జీతం పెట్టడానికి ఏదైనా కంపెనీ సిద్ధంగా ఉందా?’” అని.
అప్పుడు కంపెనీలు ముందు ఒకటే ఆలోచిస్తాయి.98 వేల డాలర్లు… ఫ్రెషర్‌కు కూడా ఇంతా? ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉన్న ఒక ఉద్యోగిని ఇంత భారీ జీతంకి అమెరికాకు తీసుకురావటం అవసరమా ..ఇదే బడ్జెట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న మన అమెరికన్ దొరుకుతాడేమో!” . అక్కడే ఫ్రెషర్లకు అసలు టెన్షన్ మొదలవుతుంది.
Gen Zకి అసలు భయం ఇదే!
ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టిన వాళ్లకు అమెరికా అనేది కేవలం ఒక దేశం కాదు. ఒక career upgrade. కానీ ఇలాంటి కొత్త రూల్స్ వల్ల కంపెనీలు ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు H-1B స్పాన్సర్షిప్ ఇవ్వడంలో మరింత సెలెక్టివ్‌గా మారితే? అప్పుడు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. “ఈ వ్యక్తిని అమెరికాకు తీసుకెళ్లడం కంపెనీకి నిజంగా ఉపయోగమా?” అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సి రావచ్చు.
ఓ రకంగా అమెరికా కల ముగిసిపోయిందని కాదు. కానీ average profileతో అమెరికా ఛాన్స్ రావడం కాస్త టఫ్ కావచ్చు.
అమెరికా ఏమని చెప్తోంది?
“Foreign talent కావాలా? తీసుకోండి. కానీ cheap labour కోసం మాత్రం తీసుకోకండి.”
అయితే ఈ రూల్ చివరికి ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? అదే ఇప్పుడు అసలు డిబేట్. చిన్న కంపెనీలకు ఈ రూల్ అసలైన headache! పెద్ద టెక్ కంపెనీలు భారీ జీతాలు ఇవ్వడం కొత్త కాదు.కానీ ప్రతి కంపెనీకి Google లేదా Microsoft లాంటి బడ్జెట్ ఉండదు కదా! చిన్న కంపెనీలు, స్టార్టప్‌లు ప్రతి hiring decisionను లెక్కలు వేసుకునే తీసుకుంటాయి.
అలాంటి సమయంలో విదేశాల నుంచి ఒక జూనియర్ ఉద్యోగిని తీసుకురావడానికే భారీ ఖర్చు వస్తే… వాళ్లు సింపుల్‌గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. “మన దగ్గరే టాలెంట్ దొరుకుతుంటే, బయట నుంచి ఎందుకు తీసుకురావాలి?” ఇదే ట్రంప్ ప్రభుత్వానికి కావాలి.
అమెరికా డోర్స్ క్లోజ్ అయిపోయాయా?
అలాంటిదేమీ ఇంకా జరగలేదు. ఇది ఇంకా ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది ఫైనల్ డెిషన్ కాదు. రెండోది, 98 వేల డాలర్లు అంటే ప్రతి హెచ్-1బీ ఉద్యోగికి ఫిక్స్డ్ జీతం కాదు. అమెరికాలో ఏ నగరంలో ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ ఆ ఉద్యోగానికి మార్కెట్ జీతం ఎంత అనే విషయాలను బట్టి వేతనాలు మారుతాయి.
కాబట్టి ఇప్పుడే… “అమెరికా ఛాప్టర్ క్లోజ్!” అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ కంపెనీల hiring calculations మాత్రం మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.రోజు రోజుకూ ఇలా టైట్ చేస్తుందని మాత్రం చెప్పగలం.
Gen Zకి మెసేజ్ చాలా క్లియర్.
కేవలం అమెరికా వెళ్లాలనే డ్రీమ్ ఉంటే సరిపోదు. కంపెనీ మీ కోసం extra ఖర్చు పెట్టడానికి కూడా మీరు worth అనిపించాలి.మొత్తానికి అమెరికా డోర్ ఇంకా ఓపెన్‌గానే ఉంది. కానీ ఆ డోర్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త చెక్‌పాయింట్ కనిపిస్తోంది.వీసా ఉందా? అన్న ప్రశ్న తర్వాత… “ఈ candidate కోసం కంపెనీ అంత ఖర్చు పెట్టడానికి రెడీనా?” అన్నదే నెక్స్ట్ లెవల్ ప్రశ్న. అందుకు సిద్దంగా ఉండండి.








