టీడీపీ ఎంపీ వేమిరెడ్డి కోటి విరాళం
టీడీపీ ఎంపీ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు (Government Schools), హాస్టల్స్ (Hostels) కు అండగా నిలిచారు. నెల్లూరు జిల్లా ( Nellore District)లోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ వసతుల కల్పనకు సాయం ప్రకటించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ప్రారంభించిన విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షుశుక్లా (Himanshu Shukla)ను ఎంపీ వేమిరెడ్డి కలిసి రూ.కోటి విరాళం ఇస్తానని తెలియజేయగా, కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.5 కోట్ల విరాళాలు అందాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు.








