పూల సుబ్బయ్య కుమార్తెలను సన్మానించిన చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ఫేజ్-1ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం సభా వేదికపై వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య(Poola Subbaiah) కుమార్తెలు విలాసిని ( Vilasini), సునందన (Sunandana)ను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని, చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని పూల సుబ్బయ్య కుమార్తెలు అన్నారు. తన తండ్రిని, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని విలాసిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాళ్లకు వారు నమస్కరించారు. తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలిపారు.








