ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికలు ఆగవు : మంత్రి కొల్లు రవీంద్ర
బీసీ రిజర్వేషన్లు (BC reservations), ఓటర్ల జాబితాపై కేసులు వేస్తుండటంపై మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ( Jagan) ఎన్ని కుట్రుల పన్నినా స్థానిక సంస్థల ఎన్నికలు (local body Elections) ఆగవన్నారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల విషయంలో జగన్‌ది ద్వంద్వ వైఖరి అని దుయ్యబట్టారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా తమను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ప్రజలకు అంకింతం చేస్తామన్నారు.








