పెళ్లి వేడుకల్లో… మగువల అందాన్ని మరింత పెంచే డిజైనర్ ఇయర్ రింగ్స్ ఇవిగో!
పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకల సమయాల్లో ప్రతి స్త్రీ తనను తాను రాయల్ డిజైన్స్‌తో మరింత అందంగా అలంకరించుకోవాలని కోరుకుంటుంది. సాంప్రదాయ దుస్తులకు తగినట్లుగా ఉండే భారీ డిజైనర్ ఇయర్ రింగ్స్ మన రూపాన్ని పూర్తిగా మార్చేసి ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి.
ముఖ్యంగా చీరలు, లెహంగాలు, పట్టు దుస్తులతో జత చేసుకునే రాయల్ ఇయర్ రింగ్స్ లుక్కు మరింత గ్రాండ్‌నెస్‌ను తీసుకొస్తాయి. బంగారు రంగు, కుందన్, స్టోన్ వర్క్, ముత్యాల డిజైన్స్‌లో ఉండే చెవిపోగులు సంప్రదాయ అందాన్ని మరింతగా హైలైట్ చేస్తాయి.
పింక్ మిలన్ విత్ లోటస్ డ్రాప్స్

తామర పూల నగిషీలు, నాజూకైన మీనాకారీ పనితనంతో రూపొందించిన ఈ ఝుమ్కీలు ఎంతో అందంగా ఉంటాయి. పింక్ మరియు లైట్ గ్రీన్ రంగురాళ్ల కలయికతో రూపొందిన ఈ డిజైన్ లహంగాలు, పట్టుచీరలకు రాయల్ ఫినిషింగ్ ఇస్తుంది.
తామర పువ్వుల ఆకృతి ఈ కమ్మలకు ప్రత్యేకమైన ట్రెడిషనల్ టచ్‌ను అందిస్తుంది. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక వేడుకల్లో సంప్రదాయ ఆభరణాలను ఇష్టపడే వారికి ఇది చక్కటి ఎంపికగా నిలుస్తుంది.
పెర్పుల్ అండ్ పెర్ల్ జుమ్కా చాంద్ బాలి

సాంప్రదాయ చాంద్ బాలి మోడల్లో రూపొందించిన ఈ లేయర్డ్ జుమ్కాలు రాయల్ లుక్‌కి ప్రతీకగా నిలుస్తాయి. పర్పుల్ బిడ్స్ మరియు పర్ల్ కాంబినేషన్‌తో వచ్చే ఈ భారీ కమ్మలు బ్రైడల్ డిజైనర్ దుస్తులకు ఎంతో చక్కగా సరిపోతాయి.
జుమ్కా ఆకృతికి కిందివైపు వేలాడే ముత్యాలు మరింత గ్రాండ్ లుక్‌ను తీసుకొస్తాయి. పర్పుల్ రంగు రాళ్లు ఆభరణానికి ఆకర్షణను పెంచడంతో పాటు, హెవీ సిల్క్ లేదా డిజైనర్ వేర్‌తో అందంగా కనిపిస్తాయి.
రోజ్ గోల్డ్ విత్ డాజ్లింగ్ డైమండ్స్

ఆధునిక శైలికి అద్దం పట్టే రోజ్ గోల్డ్ శ్రేణి కమ్మలు మెరిసే డైమండ్స్, పింక్ క్రిస్టల్ డ్రాప్స్‌తో ఎంతో విలాసవంతంగా ఉంటాయి. వెస్ట్రన్ లేదా ఇండో-వెస్ట్రన్ గౌన్లకు ఈ లాంగ్ హాంగింగ్ ఇయర్ రింగ్స్ రాయల్ గ్లామర్‌ను జత చేస్తాయి.
రోజ్ గోల్డ్ ఫినిష్ వల్ల ఈ డిజైన్‌కు సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ వస్తుంది. పార్టీలు, రిసెప్షన్స్ లేదా కాక్టెయిల్ ఈవెంట్స్‌లో స్టైలిష్‌గా కనిపించాలనుకునే వారికి ఈ డిజైన్ బాగా నప్పుతుంది.
పీకాక్ విత్ లాంగ్ చైన్ చాంద్ బాలి

మయూర ఆకృతి (పీకాక్ డిజైన్)తో పాటు కింద వేలాడే సన్నటి గోల్డ్ చైన్లు ఈ ఇయర్ రింగ్స్‌కు మరింత అందాన్ని తెస్తాయి. పచ్చలు (గ్రీన్ స్టోన్స్), మీనాకారీ వర్క్‌తో ఉండే ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పీకాక్ మోటిఫ్ భారతీయ ఆభరణాల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. పొడవైన చైన్ డీటెయిలింగ్ వల్ల ముఖానికి మరింత ఆకర్షణీయమైన ఫ్రేమ్ లుక్ వస్తుంది. చీరలు, లహంగాలు, అనార్కలీ వంటి ఎథ్నిక్ దుస్తులతో ఇది అద్భుతంగా ఉంటుంది.
రాయల్ రూబీ అండ్ మదర్ ఆఫ్ పెర్ల్ పీకాక్

రాచరికాన్ని ఉట్టిపడేలా చేసే రూబీ రాళ్లు, వైట్ మదర్ ఆఫ్ పెర్ల్ విత్ పీకాక్ కాంబినేషన్ ఎంతో ప్రత్యేకమైనది. చుట్టూ గుత్తులుగా ఉన్న ముత్యాల డ్రాప్స్ ఈ డిజైన్‌కు క్లాసిక్ ఎలిగెన్స్ మరియు రిచ్ లుక్ అందిస్తాయి.
రూబీ రెడ్, పెర్ల్ వైట్ కలయిక ఆభరణానికి కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. పీకాక్ ఆకృతి మధ్యలో ఉండటంతో డిజైన్‌కు మరింత గ్రాండ్ అప్పీల్ వస్తుంది. బ్రైడల్ వేడుకలు, రిసెప్షన్లు, ఫెస్టివ్ లుక్స్‌కు ఈ కమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.








