‘‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’’.. డీఎంకేకి ఝలక్
చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలకమైన పరిణామం జరిగింది. టీవీకే నేతృత్వంలోని రాజకీయ కూటమికి అధికారికంగా ఓ పేరు ఖరారైంది. ‘‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’’ అనే పేరు ఖరారైంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధ్వర్యంలో మిత్ర పక్షాలు భేటీ అయ్యాయి. ఇందులో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలు పాల్గొన్నాయి.
కూటమి పేరును ఖరారు చేసేందుకు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీలకు చెందిన సీనియర్ల నేతలు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీలన్నీ ఇందులో భాగమేనని ప్రకటించారు. తమ కూటమి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.
కూటమిలోని ప్రధాన పార్టీలకు సెక్యులరిజం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఓ వైఖరి అవలంబించనున్నారు. అదే అంశాలను ప్రతిబింబించే విధంగానే కూటమి పేరు కూడా నేతలు ఖరారు చేశారు. ఇకపై మేము కలిసి పనిచేస్తాం. మేము బలమైన పునాదిపై ఉన్నాం,” అని ఆయన అన్నారు. అలాగే, తమిళనాడు మరియు పుదుచ్చేరిలోని మూడు స్థానాలకు అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికల కోసం తమ అభ్యర్థుల పేర్లను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని కూడా నేతలు తెలిపారు.








