‘‘హోమియాపతి’’ మందు మాధ్యమంగా ‘‘దిమాగీ నక్సల్స్’’ అంశం మరోమారు…
ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి మరోసారి ‘‘దిమాగీ నక్సల్స్’’ అనే మాట వొచ్చింది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోట మీది నుంచి మొదటి సారిగా ఈ పదాన్ని మోదీ ఉపయోగంలోకి తెచ్చారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా.. దేశంలోనే అత్యత ప్రసిద్ధి చెందిన ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి దిమాగీ నక్సల్స్ పదాన్ని ఉపయోగించారు. దీని ద్వారా ఇదే వేదిక నుంచి యువతను ఆకర్షించే విధంగా మాట్లాడారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ పదాన్ని స్వీకరించి, ఒక నిర్దిష్ట అజెండాను ప్రచారం చేస్తున్న వారిపై దేశం నిఘా ఉంచిందని మోదీ సంచలన ప్రకటన చేశారు. నేను స్వాతంత్ర్య దినోత్సవం నాడు ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని సృష్టించాను. దిమాగీ నక్సల్ అజెండాకు వేదికను అందిస్తోంది” అని అన్నారు.
హోమియోపతి మందు గురించి తాను చేసిన ప్రస్తావనను వివరిస్తూ, అటువంటి మందు ఇచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు మొదట్లో మరింత తీవ్రంగా కనిపించవచ్చని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణగా, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను “దిమాగీ నక్సల్” (మేధోపరమైన నక్సల్) అనే పదాన్ని ఉపయోగించిన తర్వాత, తాను ఎవరినైతే ఉద్దేశించి ఆ మాట అన్నారో వారు బహిరంగంగా బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు.
“హోమియోపతిక్ దిమాగీ నక్సల్” (మేధోపరమైన నక్సల్) అనే పదాన్ని ప్రస్తావించిన వెంటనే, ఆ వర్గానికి చెందినవారని తాను అభివర్ణించిన వారంతా బయటకు వచ్చారని ఆయన అన్నారు.”నేను ‘హోమియోపతిక్ దిమాగీ నక్సల్’ అనే పదాన్ని ప్రస్తావించిన వెంటనే, దిమాగీ నక్సల్స్ అందరూ బయటకు వచ్చారు,” అని ప్రధాని మోదీ అన్నారు.
దిమాగీ నక్సల్స్ అని తమను తాము అభివర్ణించుకునే వారిని, ఆ భావజాలంలో వున్న వారిని తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని, దేశం వారిని గమనిస్తోంది అని మోదీ అన్నారు.








