హఠాత్తుగా కెరీర్ మార్చేసిన అభినందన్ వర్ధమాన్
భారత వాయుసేనకు చెందిన అత్యంత ప్రసిద్ధి పొందిన ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ కొత్త కెరీర్ ను ప్రారంభించారు. గోవాకు చెందిన ప్రైవేట్ విమానయాన సంస్థలో కమర్షియల్ పైలట్ గా చేరారు. ఇందుకోసం ఐఏఎఫ్ నుంచి ముందస్తు రిటైర్మంట్ కూడా తీసుకున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. గోవా కేంద్రంగా నడుస్తున్న FLY91 లో పైలట్ గా చేరారు. ఆగస్టులోనే చేరినట్లు సమాచారం.
నిజానికి అభినందన్ వర్ధమాన్ 22 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. qnrso.. 2019 పుల్వామా అటాక్ తర్వాత భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్ వైమానిక దాడి సమయంలో అభినందన్ పేరు దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యింది. వైరల్ అయ్యింది కూడా. బాలాకోట్ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27 న పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 విమానం భారత్ కి దూసుకు రాగా, నాటి వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 ఫైటర్ జెట్ తో దానిని కూల్చేశారు.
ఇవి కూడా చదవండి
అదే సమయంలో వర్ధమాన్ విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకగా, పాక్ భూభాగంలో పడిపోయారు. దీంతో పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విడుదల చేయాలని భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా తీవ్రంగా ఒత్తిళ్లు కూడా తెచ్చింది. దీంతో పాక్ వాఘా సరిహద్దు వద్ద భారత్ కి అప్పగించింది. దీంతో కథ సుఖాంతమైంది. దీని తర్వాత 2021 లో కేంద్రం ఆయన్ను ‘‘వీర్ చక్ర’’ పురస్కారంతో సత్కరించింది.








