3rd  September2026

_________

- Bhuvana

10 నిమిషాల్లో తయారయ్యే టేస్టీ టమాటా రైస్

2 కప్పుల వండిన అన్నం, 2–3 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఉప్పు, పసుపు, కారం తీసుకోండి.

కావాల్సిన పదార్థాలు

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించండి.

ముందుగా తాలింపు

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తగా మారే వరకు వేయించండి. అల్లం-వెల్లుల్లి కూడా వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

ఉల్లిపాయ వేయించండి

తరిగిన టమాటాలు వేసి మూతపెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. టమాటాలు మెత్తగా అయితేనే రైస్‌కు మసాలా బాగా పడుతుంది. 

టమాటాలు జోడించండి

పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. మసాలా నుంచి మంచి వాసన వచ్చే వరకు కాసేపు వేయించండి.

మసాలాలు వేయండి

ఇప్పుడు ముందుగా వండిన అన్నాన్ని టమాటా మిశ్రమంలో వేసి గింజలు విరగకుండా నెమ్మదిగా కలపండి. ప్రతి గింజకు మసాలా పట్టేలా చూడండి.

అన్నం కలపండి

వేడి టమాటా రైస్‌ను పెరుగు లేదా ఉల్లిపాయ రైటాతో సర్వ్ చేస్తే కాంబినేషన్ అదిరిపోతుంది. లంచ్‌బాక్స్‌కు కూడా ఇది మంచి ఎంపిక. 

టేస్టీగా సర్వ్ చేయండి