కొన్ని ఆహారాలు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో ఆమ్ల స్థాయిలు తగ్గి కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయి.
పుచ్చకాయ
అరటిపండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. దీనివల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది.
అరటిపండు
వేరుశనగలు తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వేరుశనగలు
చల్లటి ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీరు తాగితే దంతాలు సున్నితంగా మారడంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఐస్ క్రీమ్
నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే గొంతులో మంట, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.
పుల్లటి పండ్లు
వేడి టీ, కాఫీ తాగాక వెంటనే నీరు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతిని కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది.
టీ లేదా కాఫీ
ఎక్కువ కారం లేదా మసాలా ఉన్న ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే మంట మరింత ఎక్కువగా మారుతుంది.
కారం పదార్థాలు
నూనెలో వేయించిన స్నాక్స్ తిన్న వెంటనే నీరు తాగితే కొవ్వు పదార్థాలు గడ్డకట్టి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.
వేయించిన ఆహారాలు
ఏదైనా ఆహారం తీసుకున్న కనీసం 30 నిమిషాల తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య సూత్రం