ఉదయాన్నే కేవలం 5 నిమిషాల పాటు కొన్ని సాధారణ స్ట్రెచ్‌లు చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండవచ్చు. అవేంటో చూద్దాం.
మోకాళ్లపై నిలబడి వెన్నుములను పైకి, క్రిందికి కదపడం వల్ల వెన్నెముక వశ్యత పెరిగి నడుము నొప్పి తగ్గుతుంది.
క్యాట్-కౌ స్ట్రెచ్
మోకాళ్లపై కూర్చుని చేతులను ముందుకు చాచి తలను నేలకు ఆనించడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
చైల్డ్ పోజ్
నిలబడి ఇరువైపులకు శరీరాన్ని వంచడం వల్ల పక్కటెముకల కండరాలు సాగి రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
సైడ్ బెండ్స్
నిలబడి ముందుకు వంగి కాళ్ల వేళ్లను తాకడానికి ప్రయత్నించడం ద్వారా కాళ్ల కండరాల బిగువు తొలగిపోతుంది.
హ్యామ్‌స్ట్రింగ్ స్ట్రెచ్
మెడను నెమ్మదిగా వృత్తాకారంలో తిప్పడం వల్ల మెడ కండరాల బిగుసుకుని పోవడం తగ్గి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి.
నెక్ రోల్స్
భుజాలను పైకి కిందకి తిప్పడం వల్ల రోజూవారీ అలసట తొలిగిపోయి ఎగువ శరీరం తేలికగా అనిపిస్తుంది.
షోల్డర్ ష్రగ్స్
కడుపుపై పడుకుని పైభాగాన్ని లేపడం వల్ల ఛాతి భాగం తెరుచుకుని శ్వాసక్రియ మెరుగవుతుంది.
కోబ్రా పోజ్
నిటారుగా కూర్చుని దీర్ఘంగా గీల్చుకుంటూ వదలడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అంది శక్తి లభిస్తుంది.
డీప్ బ్రీతింగ్
ప్రతిరోజూ ఉదయం ఈ చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం ఫిట్‌గా, రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.
రోజూవారీ అలవాటు