అనిల్ రావిపూడి కోసం స్టార్ ప్రొడ్యూసర్ల క్యూ..
టాలీవుడ్ లో వరుస సక్సెస్‌లతో టాప్ కమర్షియల్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి(anil ravipudi) ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగుతున్నారు. వేగంగా సినిమాలు పూర్తి చేయడం, నిర్మాతలకు అనుకూలమైన వర్కింగ్ స్టైల్ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం వెంకటేష్(Venkatesh), కళ్యాణ్‌రామ్(Kalyan ram) ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను రూపొందిస్తుండగా, ఆ సినిమాను సాహు గారపాటి(Sahu garapati) నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఫ్యూచర్ లో కూడా ఈ కాంబినేషన్ కొనసాగనున్నట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక అనిల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో పలువురు ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పెద్ది(Peddi) నిర్మాత వెంకట సతీష్ కిలారు(venkata satish Kilaru) బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions)తో కూడా ఒక ప్రాజెక్ట్‌కు కమిట్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers)తో కూడా గత కొంతకాలంగా డిస్కషన్స్ కొనసాగుతున్నాయని, సరైన కథ, హీరో ఫిక్స్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ ప్రాజెక్టుల అమలు పూర్తిగా హీరోల డేట్స్, కథల ఎంపికపై ఆధారపడే అవకాశం ఉంది. మరోసారి నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna)తో అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశంపై కూడా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో మరోసారి కలిసి పనిచేసే అంశంపైనా డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్ ఉంది. అయితే ఈ ప్రాజెక్టులపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అనిల్ రావిపూడి తదుపరి లైనప్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇండస్ట్రీలో మరింత పెరుగుతోంది.








